కూతుర్ని చూసి ఈల వేశారని వెళ్లి.. | father went to confront his daughter's teasers AND DEAD | Sakshi
Sakshi News home page

కూతుర్ని చూసి ఈల వేశారని వెళ్లి..

Jul 9 2016 8:53 AM | Updated on Sep 28 2018 3:41 PM

కూతుర్ని చూసి ఈల వేశారని వెళ్లి.. - Sakshi

కూతుర్ని చూసి ఈల వేశారని వెళ్లి..

కూతురు పట్ల వెకిలిగా ప్రవర్తించిన యువకులకు ప్రశ్నించడానికి వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన కేరళలోని త్రిసూర్లో చోటు చేసుకుంది.

త్రిసూర్: కూతురు పట్ల వెకిలిగా ప్రవర్తించిన యువకులను ప్రశ్నించడానికి వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన కేరళలోని త్రిసూర్లో చోటు చేసుకుంది. తన కూతుర్ని చూసి ఈల వేశారన్న కోపంతో ఆకతాయిలకు బుద్ధి చెప్పడానికి వెళ్లి ఆయన హతమయ్యాడు.

రమేష్ అనే వ్యక్తి తన కూతురు(17), కుమారుడు(16)ని తీసుకొని బైక్ పై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ముగ్గురు యువకులు ఈల వేసి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం కూతురు, కొడుకును ఇంటికి చేర్చిన రమేష్.. ఆ ఆకతాయిలను ప్రశ్నించడానికి వెళ్లాడు. వారితో పోట్లాడే క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు. పిల్లలు వారిస్తున్నా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన రమేష్.. ఎంతకీ తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు మృతి వార్త తెలిసి షాక్ తిన్నారు. రమేష్కు గతంలో ఒకసారి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన బంధువులు తెలిపారు. ఈ ఘటనలో టీజింగ్కు పాల్పడిన యువకులపై కేసునమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement