ఆ బాబు నిజంగానే మూడు క‌ళ్లతో జ‌న్మించాడా?

Fact Check: Three Eyed Baby Is an Editing - Sakshi

న్యూఢిల్లీ: "మూడు క‌ళ్ల‌తో బాబు జ‌న‌నం.. శ్రీ బ్ర‌హ్మంగారు చెప్పిన‌ కాల‌జ్ఞానం నిజ‌మైంది.." అంటూ ఓ వార్త తెగ వైరల‌వుతోంది. ఇందులో ఓ బాబు మూడు క‌ళ్ల‌తో క‌నిపిస్తున్నాడు. శివుడికి మూడో క‌న్ను ఎక్క‌డైతే ఉందో, అదే నుదుటిపై ఈ బుడ్డోడికి కూడా మూడో నేత్రం క‌నిపిస్తోంది. అది కూడా నిజ‌మైనదానిలా భ్ర‌మ క‌లిగించ‌డంతో ఈ పిల్లోడి వీడియోను నెటిజ‌న్లు గుడ్డిగా న‌మ్మేస్తూ అత‌డిని 'మిరాకిల్ బేబీ' అని పిలుస్తున్నారు. ఈ పిల్లాడి వీడియో క‌నిపించ‌ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామే లేదంటే అతిశ‌యోక్తి లేదు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్ ఎక్క‌డ చూసినా ఇత‌డి ఫొటోలు, వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. (విప‌రీతంగా వైర‌లైన‌‌ టాప్ ఫేక్ న్యూస్‌లు)

అస‌లు విష‌య‌మేంటంటే... ఇది అచ్చమైన ఫేక్ వీడియో. ఆ బుడ్డోడికి అంద‌రిలాగే రెండు క‌ళ్లు మాత్ర‌మే ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ ద్వారా నుదుటి మీద లేని నేత్రాన్ని సృష్టించారు. ఈ వీడియో తొలిసారిగా జూలై 9న‌ ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది.  దీన్ని వారు ఇది 'క్రేనియోఫేషియ‌ల్ డూప్లికేష‌న్' అని పేర్కొన్నారు. అంటే న‌కిలీ ముఖాన్ని సృష్టించ‌డం అన్న‌మాట‌. కాబ‌ట్టి 'విదేశంలో మూడు క‌ళ్ల‌తో విచిత్ర‌మైన శిశువు జ‌న్మిస్తుంద'‌ని చెప్పిన బ్ర‌హ్మంగారి జోస్యానికి దీనికి ఎలాంటి సంబంధ‌మూ లేదు. (వైరల్‌: గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయడానికి వెళ్తూ..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top