breaking news
three eyes
-
మూడు కళ్లతో బాబు: నిజమేనా?
న్యూఢిల్లీ: "మూడు కళ్లతో బాబు జననం.. శ్రీ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైంది.." అంటూ ఓ వార్త తెగ వైరలవుతోంది. ఇందులో ఓ బాబు మూడు కళ్లతో కనిపిస్తున్నాడు. శివుడికి మూడో కన్ను ఎక్కడైతే ఉందో, అదే నుదుటిపై ఈ బుడ్డోడికి కూడా మూడో నేత్రం కనిపిస్తోంది. అది కూడా నిజమైనదానిలా భ్రమ కలిగించడంతో ఈ పిల్లోడి వీడియోను నెటిజన్లు గుడ్డిగా నమ్మేస్తూ అతడిని 'మిరాకిల్ బేబీ' అని పిలుస్తున్నారు. ఈ పిల్లాడి వీడియో కనిపించని సోషల్ మీడియా ప్లాట్ఫామే లేదంటే అతిశయోక్తి లేదు. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇతడి ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. (విపరీతంగా వైరలైన టాప్ ఫేక్ న్యూస్లు) అసలు విషయమేంటంటే... ఇది అచ్చమైన ఫేక్ వీడియో. ఆ బుడ్డోడికి అందరిలాగే రెండు కళ్లు మాత్రమే ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ ద్వారా నుదుటి మీద లేని నేత్రాన్ని సృష్టించారు. ఈ వీడియో తొలిసారిగా జూలై 9న ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షమైంది. దీన్ని వారు ఇది 'క్రేనియోఫేషియల్ డూప్లికేషన్' అని పేర్కొన్నారు. అంటే నకిలీ ముఖాన్ని సృష్టించడం అన్నమాట. కాబట్టి 'విదేశంలో మూడు కళ్లతో విచిత్రమైన శిశువు జన్మిస్తుంద'ని చెప్పిన బ్రహ్మంగారి జోస్యానికి దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. (వైరల్: గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేయడానికి వెళ్తూ..) -
మూడు కళ్లతో లేగదూడ జననం
చిన్నశంకరంపేట(మెదక్): మూడు కళ్లతో లేగదూడ జన్మించిన సంఘటన చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గజగట్లపల్లి గ్రామానికి చెందిన గిర్కల వెంకటయ్యకు చేందిన ఆవుకు బుధవారం ఉదయం లేగదూడ జన్మించింది. లేగ దూడకు మూడు కళ్లు ఉండడంతో పాటు ముక్కులేదు. దీంతో గ్రామస్తులు లేగదూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు తలలు, మూడు కళ్లు!
చిత్రంలో ఉన్న ఈ మార్జాలం చాలా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే రెండు తలలతో జన్మించి 15 ఏళ్లపాటు జీవించిన పిల్లి ఇది. ఫ్రాంక్ అండ్ లూయీగా పిలుచుకునే ఈ ఆడపిల్లికి రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని నార్త్ గ్రాఫ్టన్లో ఇది ఉండేది. క్యాన్సర్ కారణంగా గురువారం ఈ పిల్లి మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇలాంటి పిల్లులు ప్రపంచంలో కేవలం తొమ్మిదే ఉన్నాయని వైద్యులు తెలిపారు.