ముంబై పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది.
ముంబైలో పేలుడు పదార్థాలు స్వాధీనం
Aug 7 2017 4:02 PM | Updated on Sep 11 2017 11:31 PM
ముంబై: ముంబై పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ముంబైలో థానే సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. తొమ్మిది డిటోనేటర్లు, 15కేజీల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సం దగ్గరపడుతున్న నేపథ్యంలో పేలుడు పదార్థాలను లభ్యమవడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
Advertisement


