ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ | EAMCET counselling to commence today | Sakshi
Sakshi News home page

ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ

Aug 11 2014 11:35 AM | Updated on Sep 5 2018 9:18 PM

ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ - Sakshi

ఎంసెట్ అడ్మిషన్లపై మధ్యాహ్నం విచారణ

ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై సోమవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నఈ వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనున్న విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ : ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై సోమవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నఈ వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవటంతో ఆ ప్రభుత్వం పాస్ ఓవర్ కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.

కాగా ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వాదనను ఈ నెల 4న సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ.. ఆగస్టు 31 లోగా అడ్మిషన్లను పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత సుప్రీం తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement