మానసిక స్థితి సరిగ్గాలేని ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు ఓ దుర్మార్గుడు.
దివ్యాంగురాలిపై ఇద్దరి పిల్లల తండ్రి అత్యాచారం
Mar 6 2017 7:19 PM | Updated on Jul 28 2018 8:53 PM
బెర్హంపూర్: ఒడిషాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గాలేని ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన గంజమ్ జిల్లా హింజిలీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటి పక్కన ఉండే వ్యక్తే ఈ దారుణానికి వడిగట్టాడు. ఎవరు లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడని, ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం తెలిసిందని బాధితురాలి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఇద్దరి పిల్లల తండ్రి అని, 41 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని, కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు.
Advertisement


