ఉంపన్‌.. కోల్‌కతా వణికెన్‌

Cyclone Amphan lifeless 72 in West Bengal - Sakshi

72 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో తుపాను విలయం  

ధ్వంసమైన ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాలు

రాష్ట్రానికి అదనంగా 4 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు  

కోల్‌కతా/భువనేశ్వర్‌/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్‌ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్‌ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది.

ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్‌ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్‌ టవర్లు నేలకొరిగాయి.

ట్రాఫిక్‌ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మొబైల్‌ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్‌ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

సుందర్‌బన్‌ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ప్రధాన్‌ చెప్పారు.

ఒడిశాలో భారీగా పంట నష్టం
ఉంపన్‌ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు.

బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్‌ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్‌ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.  

కరోనా కంటే భయంకరమైనది : మమత
కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్‌ తుపాను కోవిడ్‌–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్‌ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు.  

అండగా ఉంటాం: మోదీ
పశ్చిమ బెంగాల్‌ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.  
నేడు ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే
ఉంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్‌ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు.  

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద  
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-07-2020
Jul 03, 2020, 17:51 IST
ఢిల్లీ :  క‌రోనాతో పోరాడుతూ మ‌ర‌ణించిన వైద్యుడు అసీమ్ గుప్తా (52 ) కుటుంస‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు....
03-07-2020
Jul 03, 2020, 17:27 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకే రోజు 50వేలకు పైగా  కరోనా కేసులు  కూడా నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా...
03-07-2020
Jul 03, 2020, 17:08 IST
సాక్షి, హైద‌రాబాద్ :  తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ  క‌రోనా నుంచి కోలుకొని శుక్ర‌వారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఆయన...
03-07-2020
Jul 03, 2020, 16:59 IST
బెంగాల్‌ బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీకి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ
03-07-2020
Jul 03, 2020, 16:07 IST
హనోయి : వెంటాడుతున్న మహమ్మారి.. ఆపై కఠిన ఆంక్షలు వీటన్నింటి మధ్య కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు వినూత్న పోకడలతో...
03-07-2020
Jul 03, 2020, 12:52 IST
సాక్షి, ముంబై: పీపీఈ సూట్​లో డాన్స్​ చేస్తున్న ఓ డాక్టర్​ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కరోనా నేపథ్యంలో...
03-07-2020
Jul 03, 2020, 10:45 IST
సాక్షి,  న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్‌...
03-07-2020
Jul 03, 2020, 10:27 IST
మూడు నెలల క్రితం వరకు హాయిగా సాగిన వారి జీవితాలు భారంగా మారాయి.
03-07-2020
Jul 03, 2020, 10:05 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్‌ విరుగుడును...
03-07-2020
Jul 03, 2020, 09:55 IST
దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది.
03-07-2020
Jul 03, 2020, 08:37 IST
జెనీవా: కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వ్యాక్సిన్‌ రావాడానికి.. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుందని...
03-07-2020
Jul 03, 2020, 08:33 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్‌ మరింత విలయతాండవం చేస్తోంది. నిన్న(బుధవారం) ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు...
03-07-2020
Jul 03, 2020, 08:20 IST
మాస్క్‌లు ధరించి ఎవరితోనైనా ముఖాముఖిగా 4 నిమిషాల్లోపు ఉంటేనే ‘లో రిస్క్‌’
03-07-2020
Jul 03, 2020, 08:02 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా పరీక్షలు చేసేందుకు మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను వినియోగంలోకి తేలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది....
03-07-2020
Jul 03, 2020, 07:55 IST
కరోనా కేసులు.. మరణాల సంఖ్యలతో పత్రికలు నిండిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కొన్ని శుభవార్తలూ వినిపించడం మొదలైంది. ఒకవైపు కోవిడ్‌–19 నివారణకు...
03-07-2020
Jul 03, 2020, 03:45 IST
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో...
02-07-2020
Jul 02, 2020, 21:11 IST
బీజింగ్‌: మందు లేని మాయ‌రోగం వ‌చ్చిందంటే ఎవ‌రు మాత్రం భ‌య‌ప‌డిపోరు? పైగా అది భ‌యంక‌ర‌ అంటువ్యాధి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా?...
02-07-2020
Jul 02, 2020, 19:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్‌-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా...
02-07-2020
Jul 02, 2020, 16:18 IST
లండ‌న్ : మ‌న‌లో చాలామందికి కోవిడ్ వ్యాక్సిన్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, వైర‌స్ దానంత‌ట అదే స‌హ‌జంగా స‌మసిపోతుంద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటి ఫ్రొఫెస‌ర్,...
02-07-2020
Jul 02, 2020, 15:24 IST
సాక్షి, గుంటూరు: కరోనా వచ్చిందని కన్నతల్లిని కుమారుడు బస్టాండులో వదిలేసిన ఘటన గురువారం మాచర్లలో చోటు చేసుకుంది. పాల్వని(70) కొన్ని సంవత్సరాలుగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top