పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత | cs and dgp's have to take onus for missing children, says supreme court | Sakshi
Sakshi News home page

పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత

Oct 16 2014 3:59 PM | Updated on Sep 2 2018 5:20 PM

పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత - Sakshi

పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత

ఇలా పిల్లలు తప్పిపోతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

చాలా రాష్ట్రాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందులో తొలి అడుగుగా.. బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎస్, డీజీపీలను ఈనెల 30వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ దాఖలుచేసిన పిటిషన్ను విచారించే సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో చాలా యాంత్రికంగా సమాధానాలిస్తున్నాయని, దీన్ని ఇక సహించేది లేదని సుప్రీంకోర్టు చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement