పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ | Crop compensation increase: Jaitley | Sakshi
Sakshi News home page

పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ

Mar 30 2015 2:39 AM | Updated on Sep 2 2017 11:33 PM

అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు పంటనష్ట పరిహార పరిమితిని

బూందీ(రాజస్థాన్): అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు పంటనష్ట పరిహార పరిమితిని పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయమై రాష్ట్రాలతో చర్చిస్తామని చెప్పారు.

ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ గ్రామంలో జైట్లీ ఆదివారం పర్యటించి, రైతులతో మాట్లాడారు. కేంద్రం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement