ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్‌!

Cow Plays Football With Group of Boys on Field in Viral Video - Sakshi

క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆవు ఫుట్‌బాల్‌ ఆడుతున్న వీడియోను ఆయన తన ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. నవ్వు తెప్పించే ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్‌ పెట్టారు. నిజంగానే ఈ వీడియోలోని దృశ్యాలు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన దగ్గరకు వచ్చిన ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టకుండా ఆటగాళ్లతో పాటు చేసిన ఆవు విన్యాసాలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోకు 74 వేల లైక్‌లు, 2,500 కామెంట్లు వచ్చాయి. 24 మంది రిట్వీట్‌ చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. గత జన్మలో ఈ ఆవు ఫుట్‌బాలర్‌ అని ఒకరంటే, ఫుట్‌బాలర్‌ ఆత్మ ఆవులోకి ప్రవేశించిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఫుట్‌బాల్‌ను తన దూడగా భావించి కాపాడుకునేందుకు ఆవు అలా చేసిందని ఇంకొరు అభిప్రాయపడ్డారు. బెస్ట్‌ మిడ్‌ ఫీల్డర్‌ మరొకరు కితాబిచ్చారు. ఫుట్‌బాల్‌ను పుచ్చకాయ అనుకునివుండొచ్చని ఆవు పొరబడిందని కూడా కామెంట్‌ చేశారు. అయితే వీడియోలో ఉన్నది ఆవో, ఎద్దో స్పష్టంగా కనబడటం లేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ  జరిగిందనే వివరాలేమి లేవు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top