‘తపాలా కార్యాలయంలేని ఓ దేశం’

A Country With Our A Post Office Written BY Shahid Ali - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ది కంట్రీ వితౌవుట్‌ ఏ పోస్టాఫీస్‌ (తపాలా కార్యాలయం లేని ఓ దేశం)’ అంటూ అమెరికాలో నివసించిన కశ్మీరీ కవి ఆఘా షాహిద్‌ అలీ 1997లో ఓ కవిత రాశారు. 1990లో కశ్మీర్‌లో మిలిటెన్సీ తారా స్థాయికి చేరుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏడు నెలల పాటు తపాలా సేవలను నిలిపివేశారు. అప్పుడు పోస్టాఫీసుల్లో గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు, పార్సళ్లు పేరుకు పోయాయి. ఆ పరిస్థితిని దష్టిలో పెట్టుకొన ఆయన ఈ కవిత రాశారు. ఆ తర్వాత 2001లో ఆయన మరణించారు. అయితే ఆయన రాసిన ఆ కవితా ఇప్పటికీ బతికే ఉంది. ఇప్పుడు కూడా కశ్మీర్‌లో అదే పరిస్థితి ఏర్పడింది. 

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోకి 370వ అధికరణాన్ని ఎత్తివేస్తూ, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో టెలిఫోన్, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలను నిలిపివేసినప్పుడే తపాలా సేవలను కూడా నిలిపివేశారు. ఈ విషయం అంతగా దేశం దష్టికి రాలేదు. ఇప్పటికి కూడా కశ్మీర్‌లో తపాలా సేవలకు ఇంకా పునరుద్ధరించలేదు. మిగతా సర్వీసులను ఇప్పటికే పాక్షికంగానైనా పునరుద్ధరించారు. దీంతో ఇప్పటి కశ్మీరీ పరిస్థితికి ‘ది కంట్రీ వితౌవుట్‌ ఏ పోస్టాఫీస్‌’ పేరిట నాడు షాహిద్‌ అలీ రాసిన కవితా పంక్తులను ప్రముఖ కర్ణాటక çసంగీత విద్వాంసుడు టిఏం కష్ణ గుర్తు చేశారు. ఒకప్పుడు తాను చదివిన ఆ కవితా పంక్తులను గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాకు విడుదల చేశారు. 

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కశ్మీర్‌కు ఎలాంటి ఉత్తరాలుగానీ పార్సళ్లుగానీ బట్వాడా చేయరాదంటూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఢిల్లీలోని తపాలా విభాగానికి చెందిన డాక్‌ భవన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన తపాలా విభాగానికి కశ్మీర్‌ రాష్ట్రవ్యాప్తంగా 1965 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు పెరిగిన నేటి పరిస్థితుల్లో ప్రజలు తపాలా సేవలు ఉపయోగించుకోవడం తగ్గుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు మాత్రం ఈ సేవలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top