శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం కొత్త పుంతలు | Sakshi
Sakshi News home page

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం కొత్త పుంతలు

Published Sat, Oct 14 2017 1:23 AM

country is the newest in science and technology - Sakshi

చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం శాస్త్ర, సాంకే తిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతోందని, సామాన్యుల కష్టాలను తీర్చే దిశగా పరిశోధన లు పురోగతి సాధిస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. తమిళనాడులోని చెన్నై లో ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) శుక్రవారం ప్రారంభమైంది. సమాజంలోని అసమానతలను రూపుమా పేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు.

దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. నానో టెక్నాలజీ రంగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో సీఎస్‌ఐఆర్‌ గతేడాది 12వ స్థానంలో ఉండగా.. తాజాగా 9వ స్థానానికి చేరుకుం దని అన్నారు. సీఎస్‌ఐఆర్‌ వంటి సంస్థలు ఇప్పుడు అన్ని రంగాల్లో సామాన్యుల సమ స్యలకు ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా పరిష్కా రాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. వివిధ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో ఐఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. 

సాంకేతికతతో సమస్యల పరిష్కారం: సుజనా చౌదరి
గ్రామీణ భారత ప్రజల అనేక సమస్యలకు శాస్త్ర, సాంకేతికత ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. గ్రామీణ సమస్యలకు ఆ ప్రాంతాల సృజనశీలురు ఎన్నో వినూత్నమైన పరిష్కారాలు ఆవిష్కరించారని వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేసేందుకు ఐఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అఫ్గానిస్తాన్‌ మంత్రి అబ్దుల్‌ లతీఫ్‌ రోషన్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు విజయ్‌ భట్కర్, తమిళనాడు మంత్రి అన్బలగణ్, కేంద్ర భూశాస్త్ర విభాగ కార్యదర్శి రాజీవన్‌ పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలు తమ పరిశోధన వివరాలను ప్రదర్శిస్తున్నాయి. 

భారత్‌కు రుణపడి ఉన్నాం: బంగ్లాదేశ్‌ మంత్రి
తమ దేశం పాకిస్తాన్‌ కబంధ హస్తాల నుంచి విముక్తమయ్యేందుకు సాయం చేసిన భారత్‌కు బంగ్లాదేశ్‌ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ దేశానికి చెందిన మంత్రి యశ్‌ ఉస్మాన్‌ అన్నారు. ఆసియా రీజియన్‌కు భారత్‌ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, బంగ్లాదేశ్‌లు అన్ని రంగాల్లో కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement