ఫేక్‌ ట్వీట్‌కు లైక్‌: అభాసుపాలైన కాంగ్రెస్‌ నేత

Congress Leader Shashi Tharoor Likes Fake Twitter News On PLA - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌.. చైనా యువతి చేసిన ఓ ఫేక్‌‌ ట్వీట్‌కు లైక్‌ కొట్టి అభాసుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాకు చెందిన ఈవా ఝంగ్‌ అనే యువతి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోను ఆయన లైక్‌ చేశారు. చైనా సైన్యం గల్వాన్‌ ఘర్షణల సందర్భంగా గాయపడ్డ భారత సైన్యానికి సహాయం చేసిందని, ఈ సంఘటనలో చైనా సైనికులెవ్వరూ మరణించలేదని సదరు యువతి ట్వీట్‌ చేసింది. ఘర్షణల్లో గాయపడి ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతున్న భారత సైనికులకు చైనా సైనిక స్థావరాల్లో సహాయం అందిందని ఆమె పేర్కొంది.

ఈవా ట్వీట్‌

అయితే అందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన దాన్ని చూసిన వెంటనే లైక్‌ కొట్టేశారు. ఆ వీడియో గల్వాన్‌ ఘర్షణలకు చెందినది కాదని, 2017 సంవత్సరానిదని కొందరు నెటిజన్లు గుర్తించడంతో కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఈవా డిలేట్‌ చేసింది. దీంతో నెటిజన్లు శశిథరూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి : గల్వాన్‌ లోయ మాదే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top