మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట | Congress announces 3rd list of candidates for Punjab polls | Sakshi
Sakshi News home page

మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట

Jan 12 2017 7:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట - Sakshi

మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం కాంగ్రెస్‌ వెల్లడించింది.

అమృత్‌సర్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం కాంగ్రెస్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 4న జరగనున్న ఎన్నికలకు గాను ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో 77 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ మధుసుధన్‌ మిస్త్రీ ప్రకటించిన మూడో జాబితాలో ఎక్కువగా అకాలీదళ్‌ నుంచి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభించింది. అకాలీదళ్‌ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాజ్విందర్‌ కౌర్, కమల్‌జిత్‌ సింగ్‌, దేవిందర్‌ గుబయ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 117 సీట్లకు గాను తాజా జాబితాతో  కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితా 100కు చేరింది. మిగిలిన 17 సీట్ల కోసం భారీగా లాబీయింగ్‌ జరుగుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement