సాక్షి, చెన‍్నై: దివంగత ముఖ‍్యమంత్రి జయలలిత చికిత‍్స వివరాలను తెలియజేయాలని అపోలో ఆస‍్పత్రికి విచారణ కమిషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ లోగా పూర్తి వివరాలు సమర్పించాలని అందులో పేర‍్కొన్నారు. అలాగే స‍్వయంగా విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అపోలో ఆస‍్పత్రి బాధ‍్యులతో పాటు జయలలిత సహాయకుడు పూంగుండ్రన్, డాక‍్టర్ అశోక్ కుమార్‌లకు కూడా ఈ నెల పన్నెండున విచారణకు హాజరు కావాలని విచారణ కమిషన్ నోటీసులు పంపింది.