బస్టాప్‌లోని ప్రయాణికులపై కంటెయినర్ బోల్తా | bus stop roll container for passengers | Sakshi
Sakshi News home page

బస్టాప్‌లోని ప్రయాణికులపై కంటెయినర్ బోల్తా

Nov 17 2014 4:32 AM | Updated on Aug 30 2018 3:56 PM

పార్గావ్-ఖండాలా మార్గంలో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపై ఓ కంటెయినర్ అదుపుతప్పి బొల్తాపడింది.

సతారా/సాక్షి, ముంబై: మహారాష్ర్టలోని సతారా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పార్గావ్-ఖండాలా మార్గంలో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపై ఓ కంటెయినర్ అదుపుతప్పి బొల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో 15 మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడు ఇచ్చేందుకు చక్కెర సంచుల లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ ప్రయత్నించగా అది అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement