జీవితాన్నే మార్చిన ఐడియా..

Bengaluru Student Wins Rs 2.9 Crores Prize For Science Video Competition - Sakshi

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. బెంగళూరు కుర్రాడు సమయ్‌ గోధిక ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు.. ఎందుకంటే పదహారేళ్ళ ఈ నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి ఐడియా కోట్ల రూపాయల బహుమతి తెచ్చి పెట్టింది మరీ. ఎలాగంటారా... ‘బ్రేక్‌ త్రూ జూనియర్‌ చాలెంజ్‌ ’పేరుతో నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో సమయ్‌ తొలి స్థానంలో నిలిచాడు. జీవ, భౌతిక శాస్త్రాల్లో కొత్త, వినూత్న ఐడియాలను సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా 3 నిముషాల వీడియో తీసి పంపడం ఈ పోటీ లక్ష్యం.

సమయ్‌.. 24 గంటల మనిషి జీవితంలో గడియారానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఆలోచనను వీడియోగా పంపారు. మెచ్చిన న్యాయ నిర్ణేతల బృందం సమయ్‌కు రెండు లక్షల యాభై వేల డాలర్ల (రూ.1.8 కోట్ల) బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా సమయ్‌ సైన్స్‌ టీచర్‌ ప్రమీల మీనన్‌కి రూ.36 లక్షలు, పాఠశాలలో పరిశోధనశాల ఏర్పాటుకు రూ.కోటి అందించారు. ఇంతకీ సమయ్‌ దేని గురించి వీడియో పంపాడో తెలుసా.. మన జీవగడియారానికి పార్కిన్‌సన్స్‌ వ్యాధికి ఉన్న సంబందంపై వీడియో రూపొందించి పంపాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top