190 చోట్ల సీబీఐ సోదాలు

Bank Fraud Cases: CBI Conducts Raids in 190 Locations - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రూ.7 వేల కోట్లు తీసుకొని మోసం చేసిన పలువురు వ్యక్తులపై సీబీఐ దేశవ్యాప్తంగా 190 చోట్ల సోదాలు చేపట్టింది. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 16 రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో సుమారు 1000 మంది అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ వంటి పలు నగరాల్లో ప్రారంభమైన సోదాలు సాయంత్రం వరకూ కొనసాగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు చోట్ల, తెలంగాణలో నాలుగు చోట్ల అధికారులు సోదాచేశారు. ఆయా కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లపై 42 కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. క్రెడిట్‌ ఫెసిలిటీలను వీరు వివిధ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అధికారులు తెలిపారు.  

ఎస్‌బీఐకు రూ.1266 కోట్ల నష్టానికి కారణమైందన్న ఆరోపణలతో భోపాల్‌లోని అడ్వాంటేజ్‌ ఓవర్‌సీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీలోని ఎనర్జో ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌పై ఇదే ఆరోపణలతో కేసు పెట్టారు. ఎస్‌బీఐకు ఈ కంపెనీ రూ.1100 కోట్లుపైగా నష్టం కలిగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని సురానా ఇండస్ట్రీస్‌, వారణాసిలోని జేవీఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top