బంకర్ కు నిప్పంటుకుని సైనికుడు మృతి | Army man dies in LoC bunker blaze | Sakshi
Sakshi News home page

బంకర్ కు నిప్పంటుకుని సైనికుడు మృతి

Nov 10 2014 9:14 AM | Updated on Sep 2 2017 4:12 PM

నియంత్రణ రేఖ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సైనికుడు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.

శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సైనికుడు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా వద్ద జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. 
 
తూట్ మార్ గలి ప్రాంతంలోని నవ్ గాం సెక్టర్ లోని నియంత్రణ రేఖ వద్ద బంకర్ కు నిప్పంటుకోవడంతో జాట్ రెజిమెంట్ కు చెందిన భారత సైనికుడు, మరో ఇద్దరు మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినపుడు బంకర్ లో కిరోసిన్, కోక్ హీటర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement