దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తాం

Amit Shah Says NRC Will Be Implemented Throughout India - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) కార్యక్రమాన్ని చేపడతామని.. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ ఎన్నార్సీ వర్తింపజేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మంగళవారం పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏ మతానికి చెందిన వారైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. 

భారత పౌరులను గుర్తించే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (న్నార్సీ) జాబితాలో పేరు లేని వారు తహసీల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నార్సీ ప్రకారం 1971 తర్వాత దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి పంపనున్నారు. ఇక పౌరసత్వ విషయమై విజ్ఞప్తి చేయలేని నిస్సహాయ పేదవారికి వెసులుబాటు కల్పించి.. అసోం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని వివరించారు. అంతేకాక పిటిషన్లు దాఖలు చేయడానికి డబ్బు లేని వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని అమిత్ షా తెలిపారు. కాగా అసోం ప్రభుత్వం ఆగస్టు 31న విడుదల చేసిన తుది ఎన్నార్సీ జాబితాలో 19 లక్షల మందిని అక్కడి పౌరులుగా గుర్తించలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top