ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జి | Amit Shah Discharged From AIIMS | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జి

Jan 20 2019 11:19 AM | Updated on Mar 29 2019 9:13 PM

Amit Shah Discharged From AIIMS - Sakshi

అమిత్‌ షా డిశ్చార్జి

సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్‌ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్‌ బలూనీ వెల్లడించారు.

స్వైన్‌ఫ్లూ సోకిన అమిత్‌ షాకు ఎయిమ్స్‌ డైరెర్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. కాగా తాను స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని, భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement