నితీశ్‌ సారథ్యంలోనే ముందుకెళ్తాం: అమిత్‌షా

Amit Shah clears air on JDU-BJP rift - Sakshi

న్యూఢిల్లీ/పాట్నా: ‘జేడీ (యూ)తో మా బంధం బలంగా ఉందని, వచ్చే బీహార్‌ ఎన్నికలను ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని  హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా జేడీ (యూ), బీజేపీ సంబంధాలపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య సంకీర్ణ బంధం బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీచేస్తాం, జాతీయ స్థాయిలో తమ కూటమికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారని షా వెల్లడించారు. ‘కలహాలు సంకీర్ణం ఆరోగ్యకరంగా ఉందనడానికి సంకేతం. విభేదాలు ఉండడం సహజం, వాటిని మనసులోకి తీసుకుంటేనే కష్టం’అని షా అన్నారు. త్రిపుల్‌ తలాక్‌ చట్టం, 370 రద్దుపై కేంద్రానికి నితీశ్‌ కుమార్‌ మద్దతు ప్రకటించని విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top