కోపర్డీ రేప్, హత్య కేసులో ముగ్గురు దోషులు | All 3 Men In Maharashtra's Kopardi Gang-Rape, Murder Case Held Guilty | Sakshi
Sakshi News home page

కోపర్డీ రేప్, హత్య కేసులో ముగ్గురు దోషులు

Nov 19 2017 5:55 AM | Updated on Oct 8 2018 6:18 PM

All 3 Men In Maharashtra's Kopardi Gang-Rape, Murder Case Held Guilty - Sakshi

అహ్మద్‌నగర్‌(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో స్థానిక సెషన్స్‌ కోర్టు ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. 2016లో జరిగిన ఈ కేసులో రేప్, హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలపై జితేందర్‌ బాబూలాల్‌ షిండే, సంతోష్‌ గోరక్‌ భావాల్, నితిన్‌ గోపినాథ్‌ భైలూమేలను దోషులుగా తేలుస్తూ సెషన్స్‌ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2016 జూలైలో కోపర్డీలో మరాఠా వర్గానికి చెందిన ఈ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. నిందితులు బాలిక శరీరం మొత్తాన్ని తీవ్రంగా గాయపరిచారని, హత్య చేయడానికి ముందు ఆమె కాళ్లు, చేతులు విరిచేశారని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement