సెప్టెంబర్‌ నాటికి వీవీఐపీల విమానాలు సిద్ధం

Air India Likely To Get Custom Made Planes For VVIP Travel By September - Sakshi

బీ777 విమానాల ముస్తాబు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర వీవీఐపీలు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బీ777 విమానాలను బోయింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎయిర్‌ ఇండియాకు అందచేస్తుందని సీనియర్‌ అధికారులు వెల్లడించారు. వీవీఐపీల ప్రయాణం కోసమే కేటాయించిన ఈ విమానాల డెలివరీ జులై నాటికి పూర్తవుతుందని గత ఏడాది అక్టోబర్‌లో అధికారులు పేర్కొన్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో స్వల్ప జాప్యం చోటుచేసుకుందని, ఈ రెండు విమానాలు సెప్టెంబర్‌ నాటికి డెలివరీ అవుతాయని అధికారులు తెలిపారు.

ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్‌ ఇండియా పైలట్లు కాకుండా భారత వైమానిక దళ పైలట్లు నడపనున్నారు. ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) ఈ విమానాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎయిర్‌ ఇండియాకు చెందిన బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఏఐఈఎస్‌ఎల్‌ సమాకూర్చే ఎయిర్‌ ఇండియా పైలట్లు బీ747 విమానాలను నడుపుతున్నారు. ఈ విమానాల్లో ప్రముఖులు పర్యటించని సందర్భాల్లో వీటిని ఎయిర్‌ ఇండియా వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తోంది.

చదవండి : అంతర్జాతీయ టీకా కూటమికి 15 మిలియన్‌ డాలర్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top