
విమానం తగలడంతో దెబ్బతిన్న గోడ
ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు
చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం రన్‌పైకి వెళ్లే సమయంలో సిగ్నల్ టవర్‌ను తాకుతూ వెళ్లింది. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.