
లక్నో: ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టు (దారుల్ కాజా)లు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) భావిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ కోర్టులు ఏర్పాటుచేస్తే ముస్లింలు తమ సమస్యల పరిష్కారానికి ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరముండదని బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ తెలిపారు. జడ్జీలు, లాయర్లు, సామాన్యులకు షరియత్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను తఫీమ్–ఈ–షరియత్ కమిటీని పునఃప్రారంభించనున్నామన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బోర్డు ఆహ్వానిస్తుందన్నారు.