2019 ఎన్నికల అంకెల్లో అవకతవకలు

ADR And Common Cause Move Supreme Court - Sakshi

ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీసు  

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా శుక్రవారం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. దాదాపు 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును కోరాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వీరు నివేదించారు.

ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను స్పష్టంగా లెక్కకట్టాలని కోరింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్‌ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్‌ వేసుకునేందుకు అవకాశముండగా, ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top