ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి | 9 killed, six injured after vehicle skids off the road in Jammu’s Reasi | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి

Aug 9 2017 5:31 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను బుధాన్‌ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది.

ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement