నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ | 4 terrorists killed in Pulwama encounter | Sakshi
Sakshi News home page

నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

Apr 2 2019 4:13 AM | Updated on Apr 2 2019 4:13 AM

4 terrorists killed in Pulwama encounter - Sakshi

పూంచ్‌ లో గాయపడిన స్థానికుడు

శ్రీనగర్‌: లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. సోమవారం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతోపాటు ఒక పోలీసు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలోని లస్సిపోరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం ఆర్మీ గాలింపు చేపట్టింది. జవాన్లను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా, కశ్మీర్‌లోని పూంచ్‌ లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్‌ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ అధికారి, మరో ఐదేళ్ల బాలిక మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లుసహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపుర్‌ సబ్‌ సెక్టార్‌లో ఓ ఇంటి వద్ద బాంబు పేలడంతో సోబియా అనే ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement