ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి | 37 killed in Uttar Pradesh illicit liquor tragedy | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి

Oct 19 2013 3:40 PM | Updated on Sep 1 2017 11:47 PM

ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది.

ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. అజంగఢ్ జిల్లా ముబారక్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువగా కార్మికులు, పేదలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులు నీళ్లలో స్పిరిట్ను కలిపి చౌక ధరకు విక్రయించడం ద్వారా పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు.

ఈ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ సింగ్తో సహా పదిమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. న్యాయ విచారణకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement