గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!! | 22-year-old girl gangraped, forced to drink acid and strangulated | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!!

Jun 2 2014 1:43 PM | Updated on Apr 6 2019 8:51 PM

గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!! - Sakshi

గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!!

ఉత్తరప్రదేశ్లో 22 ఏళ్ల యువతిపై కొంతమంది ముష్కరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించి, చివరకు ఉరేసి చంపేశారు!!

ఉత్తరప్రదేశ్లో మహిళల మానప్రాణాలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. అక్కడి మనుషులు మరీ రాక్షసుల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా అక్కడ దారుణాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. తాజాగా 22 ఏళ్ల యువతిపై కొంతమంది ముష్కరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించి, చివరకు ఉరేసి చంపేశారు!! బరేలీకి సమీపంలోని బహేరి ప్రాంతంలోని ఐత్పురా గ్రామంలో గల పొలాల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ముఖం మీద కూడా వాళ్లు యాసిడ్ పోయశారని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత ఉరేసి చంపినట్లు తెలిసిందని పోలీసు అధికారులు చెప్పారు.

బాధితురాలి కడుపులో యాసిడ్ కూడా ఉండటంతో, వాళ్లు బలవంతంగా ఆమెతో యాసిడ్ తాగించి, తర్వాత చంపేసినట్లు తెలిసిందన్నారు. ఆమె ముఖం మీద యాసిడ్ పోసి, తర్వాత ఆమె ఎవరన్న విషయాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. బాధితురాలు బహుశా ఉత్తరాఖండ్కు చెందినవారు కావచ్చని, అందువల్ల ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ అక్కడకు ఓ బృందాన్ని పంపామని సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర గౌర్ తెలిపారు. ఇది బహుశా పరువు హత్య గానీ, లేదా అమ్మాయిలతో వ్యాపారానికి సంబంధించిన కేసు గానీ కావచ్చని డిప్యూటీ ఎస్పీ బహేరి కలు సింగ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement