breaking news
strangulated
-
గర్భిణిని పీకపిసికి చంపిన దుండగులు
పశ్చిమబెంగాల్లో మహిళల మీద అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలీపుర్దౌర్ జిల్లాలోని దాల్సింగ్పర గ్రామంలో 30 ఏళ్ల గర్భిణిని గుర్తుతెలియని దుండగులు పీక పిసికి చంపేశారు. ఆమె శరీరం మీద లెక్కలేనన్ని గాయాలున్నాయి. బాధితురాలు రేఖా దేవి షాకు రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఆమె మరణించి ఉన్నట్లు గుర్తించారని అదనపు ఎస్పీ ఆకాష్ మేఘారియా తెలిపారు. రేఖాదేవి మృతదేహం నేలమీద పడి ఉండగా, ఆమె మరణించిందని తెలియని కొడుకు ఆ పక్కనే ఏడుస్తున్నాడు. ఆమె భర్త బీహార్‌లో ఉండగా, అత్తమామలు ఏదో ఊరు వెళ్లారు. కొంత గొడవ అయిన తర్వాత ఆమెను పీకపిసికి చంపినట్లు తెలుస్తోందని అదనపు ఎస్పీ చెప్పారు. హత్యకు ఆస్తి వివాదం కూడా కారణం కావచ్చని అన్నారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. యాసిడ్ తాగించి.. ఉరేశారు!!
ఉత్తరప్రదేశ్‌లో మహిళల మానప్రాణాలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. అక్కడి మనుషులు మరీ రాక్షసుల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా అక్కడ దారుణాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. తాజాగా 22 ఏళ్ల యువతిపై కొంతమంది ముష్కరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించి, చివరకు ఉరేసి చంపేశారు!! బరేలీకి సమీపంలోని బహేరి ప్రాంతంలోని ఐత్పురా గ్రామంలో గల పొలాల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ముఖం మీద కూడా వాళ్లు యాసిడ్ పోయశారని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత ఉరేసి చంపినట్లు తెలిసిందని పోలీసు అధికారులు చెప్పారు. బాధితురాలి కడుపులో యాసిడ్ కూడా ఉండటంతో, వాళ్లు బలవంతంగా ఆమెతో యాసిడ్ తాగించి, తర్వాత చంపేసినట్లు తెలిసిందన్నారు. ఆమె ముఖం మీద యాసిడ్ పోసి, తర్వాత ఆమె ఎవరన్న విషయాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. బాధితురాలు బహుశా ఉత్తరాఖండ్‌కు చెందినవారు కావచ్చని, అందువల్ల ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ అక్కడకు ఓ బృందాన్ని పంపామని సీనియర్ పోలీసు అధికారి రవీంద్ర గౌర్ తెలిపారు. ఇది బహుశా పరువు హత్య గానీ, లేదా అమ్మాయిలతో వ్యాపారానికి సంబంధించిన కేసు గానీ కావచ్చని డిప్యూటీ ఎస్పీ బహేరి కలు సింగ్ అన్నారు.