గర్భిణిని పీకపిసికి చంపిన దుండగులు | Pregnant woman strangulated to death | Sakshi
Sakshi News home page

గర్భిణిని పీకపిసికి చంపిన దుండగులు

Jul 22 2014 2:04 PM | Updated on Sep 2 2017 10:42 AM

పశ్చిమబెంగాల్లోని అలీపుర్దౌర్ జిల్లాలోని దాల్సింగ్పర గ్రామంలో 30 ఏళ్ల గర్భిణిని గుర్తుతెలియని దుండగులు పీక పిసికి చంపేశారు.

పశ్చిమబెంగాల్లో మహిళల మీద అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలీపుర్దౌర్ జిల్లాలోని దాల్సింగ్పర గ్రామంలో 30 ఏళ్ల గర్భిణిని గుర్తుతెలియని దుండగులు పీక పిసికి చంపేశారు. ఆమె శరీరం మీద లెక్కలేనన్ని గాయాలున్నాయి.

బాధితురాలు రేఖా దేవి షాకు రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఆమె మరణించి ఉన్నట్లు గుర్తించారని అదనపు ఎస్పీ ఆకాష్ మేఘారియా తెలిపారు. రేఖాదేవి మృతదేహం నేలమీద పడి ఉండగా, ఆమె మరణించిందని తెలియని కొడుకు ఆ పక్కనే ఏడుస్తున్నాడు. ఆమె భర్త బీహార్లో ఉండగా, అత్తమామలు ఏదో ఊరు వెళ్లారు. కొంత గొడవ అయిన తర్వాత ఆమెను పీకపిసికి చంపినట్లు తెలుస్తోందని అదనపు ఎస్పీ చెప్పారు. హత్యకు ఆస్తి వివాదం కూడా కారణం కావచ్చని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement