రాజస్తాన్‌లో భారీ వర్షం; 19 మంది మృతి | 19 killed during thunderstorm in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో భారీ వర్షం; 19 మంది మృతి

Apr 13 2018 2:50 AM | Updated on Apr 13 2018 2:50 AM

19 killed during thunderstorm in Rajasthan - Sakshi

ధోల్‌పూర్‌/భరత్‌పూర్‌: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి బుధవారం రాజస్తాన్‌లో ఐదుగురు చిన్నారులుసహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గోడలు, ఇంటి పైకప్పులు, చెట్లు కూలడంతో ఎక్కువ మంది చనిపోయారు. ధోల్‌పూర్‌లో భారీ వర్షం సృష్టించిన బీభత్సం కారణంగా 13 మంది చనిపోయారని, దాదాపు 50 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సాయ్‌పావ్‌ ప్రాంతంలో వర్షం ధాటికి గోడ కూలి మీద పడడంతో ఐదేళ్ల చిన్నారి చనిపోయింది. వేర్వేరు ఘటనల్లో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్‌ పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement