ట్రక్కు ఢీ..16 మంది మృతి..50 మందికి గాయాలు | 16 killed in megalaya accident | Sakshi
Sakshi News home page

ట్రక్కు ఢీ..16 మంది మృతి..50 మందికి గాయాలు

Feb 26 2017 7:34 PM | Updated on Aug 30 2018 4:10 PM

ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో 16 మంది మృతి చెందగా 50 మంది పైగా గాయపడ్డారు.

షిల్లాంగ్‌: మేఘాలయాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టడంతో దానిలో ఉన్న 16 మంది మృతి చెందగా 50 మంది పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ కాశీ హిల్స్‌ జిల్లాలోని నాంగ్‌స్టోయిన్‌కు సమీపంలోని జ్దోక్రో గ్రామంలో  చోటు చేసుకుంది.
 
అయితే 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు మీడియాకు తెలిపారు. మృతుల్లో 9 మంది మహిళలలు, ఓ బాలిక (13) ఉందన్నారు. ప్రమాద బాధితులు నాగలాండ్‌ గ్రామస్తులని, వీరంతా ప్రేస్బెటేరియన్‌ చర్చికి వెల్లోస్తున్నారుని చెప్పారు. క్షతగాత్రులను షిల్లాంగ్‌ సివిల్‌ ఆసుపత్రికి తరిలించామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement