సైనికులను పరుగులు పెట్టించిన బాలిక | 12-year-old’s hoax sparked Uran terror scare | Sakshi
Sakshi News home page

సైనికులను పరుగులు పెట్టించిన బాలిక

Sep 29 2016 11:29 AM | Updated on Sep 4 2017 3:31 PM

సైనికులను పరుగులు పెట్టించిన బాలిక

సైనికులను పరుగులు పెట్టించిన బాలిక

భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది.

న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement