బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం | 12-Year-Old Girl Allegedly Gang-Raped By Principal, 3 Teachers In Bihar | Sakshi
Sakshi News home page

బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం

Jan 17 2017 3:11 AM | Updated on Sep 5 2017 1:21 AM

బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం

బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం

ఓ పన్నెండేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

జెహానాబాద్‌: ఓ పన్నెండేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న బాలికపై కాకోసెకండరీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అజూ అహ్మద్‌తోపాటు అతుల్‌ రహ్మాన్, అబ్దుల్‌ బరీ, ఎం.డి.శాకౌత్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారి పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఒంటరిగా ఉన్న బాలికను భవనంపైకి తీసికెళ్లి అక్కడ లైంగికదాడిచేశారని చెప్పారు. అక్కడ అచేతన స్థితిలో పడిఉన్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి గమనించింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని శ్రీవాస్తవ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement