రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | young man died in road accident at dharmajigudem | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Feb 3 2018 6:56 PM | Updated on Sep 28 2018 3:39 PM

young man died in road accident at dharmajigudem - Sakshi

రవి మృతదేహం

చౌటుప్పల్‌ (మునుగోడు) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ధర్మోజిగూడెం గ్రామ స్టేజి వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జైకేసారం గ్రామానికి చెందిన జోగు రవి (22)లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లారీని ధర్మోజిగూడెం స్టేజి వద్ద ఉన్న టైర్ల పంచర్‌ దుకాణం వద్ద నిలిపాడు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్‌ చేస్తుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement