నిరంతర విద్యుత్‌ ఘనత కేంద్రానిదే | 24 hours electricity credit goes to bjp: kisan morcha ts president | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ ఘనత కేంద్రానిదే

Jan 9 2018 4:36 PM | Updated on Mar 29 2019 9:07 PM

24 hours electricity credit goes to bjp: kisan morcha ts president - Sakshi

కనగల్‌ (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న నిరంతర విద్యుత్‌ ఘనత కేంద్రప్రభుత్వానిదేనని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం దర్వేశిపురం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ఏర్పడిన మిగులు విద్యుత్‌తోనే తెలంగాణలో నిరంతర విద్యుత్‌ అందుతుందన్నారు. తామే ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు.

విద్యుత్‌ ఆదా చేసేందుకు దేశంలో 25వేల కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసిందన్నారు. బడ్జెట్‌ కేంద్రానిది ప్రచారం రాష్ట్రానిది అయిందన్నారు. సమావేశంలో పోతెపాక సాంభయ్య, బండారు ప్రసాద్, నకిరెకంటి శంకర్, తిరందాసు కనకయ్య, నందగౌడ్, యాదయ్య, జలం దర్, కృష్ణ, రాములు, సతీశ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement