5 భాషల్లో ఫైటర్‌

Vijay Deverakonda And Puri Jagannath Movie Fighter - Sakshi

కథలో సత్తా ఉంటే ఒక్క భాష అని హద్దులు పెట్టలేం. ఇప్పుడు కథలన్నీ హద్దులు దాటుతున్నాయి. దర్శకులందరూ ప్యాన్‌ ఇండియా సినిమాలపై దృష్టిపెడుతున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా ఓ ప్యాన్‌ ఇండియా మూవీ ప్లాన్‌ చేశారు. విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్‌’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు పూరి. చార్మితో కలసి ఈ సినిమాను నిర్మిస్తారాయన. ఈ సినిమా  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా వ్యవహరించనున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథలో విజయ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తారట. దీనికి సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top