‘అదిరింది’ వచ్చేస్తోంది..! | Vijay Adirindi release date Confirmed | Sakshi
Sakshi News home page

‘అదిరింది’ వచ్చేస్తోంది..!

Nov 3 2017 1:39 PM | Updated on Nov 3 2017 1:44 PM

Vijay Adirindi release date Confirmed - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్‌. జాతీయ స్థాయిలో వివాదాలకు కారణమైన ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే మెర్సల్‌ 200 కోట‍్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ ‘అదిరింది’ రిలీజ్‌ విషయంలో మాత్రం ఆపసోపాలు పడుతోంది. తమిళ సినిమాతో పాటు  ఒకేసారి రిలీజ్‌ కావాల్సి  ఉన్నా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

అయితే తాజాగా అదిరింది రిలీజ్‌ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టుగా తెలుగు వర్షన్‌ నిర్మాతలు ప్రకటించారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ కూడా అందటంతో నవంబర్‌ 9న అదిరింది రిలీజ్‌ కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. మరి ఈ సారైన చెప్పిన సమయానికి సినిమా రిలీజ్‌ అవుతుందేమో చూడాలి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ సరసన సమంత, కాజల్‌, నిత్యామీనన్‌ లు హీరోయిన్‌లుగా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement