రీమేకే గాని.. కొత్తగా తీశాం..! | Vignesh Shivan clarity on suriya gang | Sakshi
Sakshi News home page

Dec 20 2017 3:46 PM | Updated on Dec 20 2017 3:46 PM

Vignesh Shivan clarity on suriya gang - Sakshi

కోలీవుడ్ టాప్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా స్పెషల్ 26కు రీమేక్ అన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఎక్కడా.. రీమేక్ అన్న విషయం ప్రస్తావించకపోవటంపై చర్చ మొదలైంది.

ఈ విషయంపై స‍్పందించిన చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్.. గ్యాంగ్ కథపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను స్పెషల్ 26 రీమేక్ రూపొదించినప్పటికీ పూర్తిగా కొత్త టేకింగ్ తో తెరకెక్కించామని.. సినిమా చూసిన వారికి ఎక్కడా ఇది స్పెషల్ 26 కు రీమేక్ అన్న భావన కలగదని తెలిపారు. అందుకే రీమేక్ అన్న విషయాన్ని ప్రచారం చేయటం లేదన్నారు. అయితే స్పెషల్ 26 రీమేక్ హక్కులు తీసుకునే ఈ సినిమాను రూపొందించామని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement