ఆడాళ్లూ..మరదల్ని చూడండి! | Venkatesh in Aadavallu Meeku Joharlu | Sakshi
Sakshi News home page

ఆడాళ్లూ..మరదల్ని చూడండి!

Nov 29 2016 11:37 PM | Updated on Sep 4 2017 9:27 PM

ఆడాళ్లూ..మరదల్ని చూడండి!

ఆడాళ్లూ..మరదల్ని చూడండి!

మీరు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆమె చెల్లెలు మీకు ఏమవుతుంది? వరుసకు మరదలే కదా!

మీరు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆమె చెల్లెలు మీకు ఏమవుతుంది? వరుసకు మరదలే కదా! ఆ లెక్కన వెంకటేశ్‌కు తేజస్వి మరదలు అవుతోందిప్పుడు! ‘నేను.. శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించనున్న చిత్రం ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్ చెల్లెలి పాత్రలో తేజస్వి మదివాడ నటించనున్నారు. అగ్రిమెంట్ మీద ఇంకా సంతకం చేయలేదు గానీ... దర్శకుడు కథ చెప్పడం, ఆమె ఓకే చేయడం జరిగాయి. ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట! ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’లో తేజస్వి పెంపుడు తల్లిగా నిత్య నటించారు. ఇప్పుడీ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా కనిపించనున్నారు.

ఇక, ఈ చిత్రకథ విషయానికొస్తే... ‘ప్రేమకు వయసుతో పనేముంది? మనసుతోనే కదా. వయసులో వ్యత్యాసం ఉన్న ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే?’ అనేది ముఖ్యాంశం. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుందట.ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట!

Advertisement
 
Advertisement
Advertisement