న‌టి మూడో పెళ్లి: 'డ‌బ్బుల కోస‌మే డ్రామాలు' | Vanitha Vijayakumar Clarifies On Pauls First Wife Complaint | Sakshi
Sakshi News home page

విడాకులు ఇవ్వకుండానే మ‌రో పెళ్లా?

Jun 29 2020 7:25 PM | Updated on Jun 29 2020 7:41 PM

Vanitha Vijayakumar Clarifies On Pauls First Wife  Complaint - Sakshi

న‌టి వనితా విజ‌య్‌కుమార్ శనివారం సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే మ‌రో వివాహం చేసుకోవ‌డం ప‌ట్ల పీట‌ర్ మొద‌టి భార్య ఎలిజ‌బెత్ హెలెన్ కేసు పెట్టారు. త‌మ‌కు ఇద్ద‌రు పిల్ల‌లున్నార‌ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఏడేళ్ల నుంచి విడిగా ఉంటున్నామ‌ని, అయిన‌ప్ప‌టికీ  చ‌ట్ట‌బ‌ద్ధంగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవ‌డం నేర‌మ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌‌పై స్పందించిన వ‌నితా విజ‌య్‌కుమార్..ఎలిజ‌బెత్ హెలెన్ డ‌బ్బు కోస‌మే ఈ డ్రామాలాడుతుంద‌ని మండిపడ్డారు. త‌న భ‌ర్త‌, ఎలిజ‌బెత్ ఎనిమిదేళ్ల క్రిత‌మే విడిపోయార‌ని, అలాంట‌ప్పుడు కేసు ఫైల్ చేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. కోటి రూపాయ‌లు ఇవ్వాలంటూ ఇదివ‌ర‌కే త‌మ‌ను డిమాండ్ చేసింద‌ని అయితే అంత మొత్తంలో డ‌బ్బు ఇచ్చే స్థోమ‌త త‌మ‌కు లేద‌ని తెలిపారు. పెళ్లి త‌ర్వాత సంతోషంగా గ‌డుపుతున్న త‌మ జీవితంలో ఎలిజ‌బెత్ ఇబ్బందులు సృష్టించాల‌ని చూస్తుంద‌ని అయిన‌ప్ప‌టికీ ఈ కేసుపై న్యాయ‌ప‌రంగానే గెలిచి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. (భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు )

వనితా విజ‌య్‌కుమార్, పీట‌ర్ పాల్‌ రెండురోజుల క్రితం  స‌న్నిహితుల మద్య వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పీట‌ర్‌కు ఇది రెండో పెళ్లి కాగా వ‌నితాకు ఇది మూడో పెళ్లి. క్రైస్తవ మ‌త ఆచారం ప్ర‌కారం పెళ్లి చేసుకున్న వ‌నితా..న‌టు‌డు విజ‌య్‌కుమార్, మంజుల దంప‌తుల పెద్ద  కూతురు. చంద్రలేఖ చిత్రం ద్వారా క‌థానాయుక‌గా ప‌రిచ‌య‌మైన ఆమె దేవి సినిమాతో తెలుగువారికి సుప‌రిచితం అయ్యింది. ఇక ఇటీవ‌ల త‌మిళ బిగ్‌బాస్-3 లో పాల్గొని వార్త‌ల్లోకెక్కి మ‌ళ్లీ త‌న పెళ్లితో మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. (మూడో పెళ్లి చేసుకున్న న‌టి; ఫోటోలు వైర‌ల్‌ )


 

Advertisement
 
Advertisement
Advertisement