తొలిరోజు కలెక్షన్లు.. రూ. 10 కోట్ల పైనే | 'Udta Punjab' mints Rs 10.05 crore on opening day | Sakshi
Sakshi News home page

తొలిరోజు కలెక్షన్లు.. రూ. 10 కోట్ల పైనే

Jun 18 2016 7:01 PM | Updated on Oct 5 2018 9:08 PM

తొలిరోజు కలెక్షన్లు.. రూ. 10 కోట్ల పైనే - Sakshi

తొలిరోజు కలెక్షన్లు.. రూ. 10 కోట్ల పైనే

సెన్సార్ అభ్యంతరాలను కోర్టులో ఎదిరించి, బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఉడ్తా పంజాబ్ సినిమా బంపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

సెన్సార్ అభ్యంతరాలను కోర్టులో ఎదిరించి, బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఉడ్తా పంజాబ్ సినిమా బంపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదటి రోజే ఈ సినిమాకు రూ. 10.05 కోట్లు వచ్చినట్లు సినిమా వర్గాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపాయి. సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం, కొన్నిచోట్ల ఏకంగా కేబుల్ టీవీలో కూడా ప్రసారం చేయడం.. ఇలాంటి సవాలక్ష అడ్డంకులు ఎదురైనా, మంచి కలెక్షన్లు సాధించి, సినిమాలో దమ్ముందని నిరూపించింది.

పంజాబ్‌లో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ మీద ఈ సినిమా తీశారు. దీనిలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఏకంగా 89 కట్‌లు పెట్టాలని సీబీఎఫ్‌సీ సూచించింది. అయితే, సినిమా దర్శక నిర్మాతలు దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లడంతో కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ ఆలియాభట్ నటనకు ఈ సినిమాలు నూరుశాతం మార్కులు పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement