వివాహానికి ముందే విందు ఇస్తున్న నటి

వివాహానికి ముందే విందు ఇస్తున్న నటి - Sakshi


నటి త్రిష, పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్‌ల నిశ్చితార్థం ఎట్టకేలకు ఖరారైంది. వీరిద్దరూ ప్రేమ యాత్రలు చేస్తున్నా వారి మధ్య అలాంటిదేమీ లేదని ప్రయత్నం చేసిన త్రిష తల్లి ఉమాకృష్ణ ప్రస్తుతం ఈ ప్రేమ జంటకు పెళ్లి చేస్తే ప్రయత్నాల్లో మునిగిపోయారు. పెళ్లికి ముందే ఏడు కోట్ల ఖరీదైన కారును ప్రియురాలి (త్రిష)కి కానుకగా ఇచ్చినట్లు ఒక పక్క జోరుగా ప్రచారం సాగుతోంది. మరో పక్క ఈ నెల 23న నిశ్చితార్థానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చెన్నైలో నక్షత్ర హోటల్లో జరగనున్న ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారట.

 

 దీంతో నిశ్చితార్థం పూర్తి అయిన మరుసటిరోజు అంటే 24వ తేదీన సినీ ప్రముఖులకు పసందైన విందును ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం. త్రిష దశాబ్దం కాలం పాటు తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందారు. హిందీ, కన్నడంలోను ఒక్కో చిత్రం చేశారు. నటిగా తన ఎదుగుదలకు సహకరించిన సినీ ప్రముఖులందరినీ ఈ విందుకు ఆమెతో కలసి కాబోయే భర్త వరుణ్‌మణియన్ సాదరంగా ఆహ్వానించనున్నారు. ఆహ్వాన కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఇప్పటికే ఈ జంట మొదలెట్టిందని తెలిసింది. అదే రోజున తమ వివాహ తేదీని వెల్లడించి పెళ్లి పీటల కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నామని సమాచారం. ఈ విందు కార్యక్రమం కూడా చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top