రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది | Tollywood stars Raksha Bandhan plans | Sakshi
Sakshi News home page

రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది

Aug 11 2014 1:37 PM | Updated on Sep 2 2017 11:43 AM

రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది

రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది

అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు పంచి పెట్టడం, అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం.

అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు పంచి పెట్టడం, అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకూ సోదరులు తమ స్థాయిలో అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తుంటారు. అయితే కొంతమంది సరదాగానే తమ సోదరుల నుంచి ముక్కు పిండి మరీ బహుమతులు వసూలు చేస్తుంటారు.

ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే టాలీవుడ్ హీరో మంచు విష్ణు రాఖీ బహుమతిపై స్పందించాడు. ''మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనకు కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని  కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది'' అని విష్ణు మురిపెంగా చెప్పటం విశేషం.

హీరో ఆది తన అక్క జ్యోతిర్మయికి రాఖీ సందర్భంగా ఈసారి కారు ప్రజెంట్ చేయబోతున్నాడు. సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈసారి తన సోదరి దగ్గరకు బెంగళూరు వెళ్లలేకపోతున్నానని, అలాగే ఆమె కూడా కుటుంబంతోను, డాక్టర్ కావడంతో తన వృత్తిలోను బిజీగా ఉన్నందున కలవలేకపోయినట్లు తెలిపారు. అయితే జ్యోతిర్మయి తనకు రాఖీ పంపిందని, ఈసారి ఆమెను కలిసినప్పుడు కారును గిప్ట్గా ఇవ్వనున్నట్లు చెప్పాడు.

ఇష్క్తో లైమ్లైట్లోకి వచ్చిన యువ హీరో నితిన్ తన సోదరి నిఖితకు ఫర్నిచర్ ప్రజెంట్ చేస్తున్నాడు. తామిద్దరూ రెగ్యులర్గా కలుస్తామని, తన సోదరి ఇటీవలే గెటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు చేసిందని... ఆ ఇంటికి కావల్సిన ఫర్నిచర్తో పాటు అవసరమైనవి కొనిపెడుతున్నట్లు నితిన్ తెలిపాడు.

రన్ రాజా రన్ అంటూ దూసుకొచ్చిన హీరో శర్వానంద్....తన యంగర్ సిస్టర్స్తో ధూమ్ ధామ్గా రాఖీ పౌర్ణమిని జరుపుకున్నాడు. ఓ అక్క యూఎస్లో, మిగతా ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారని తెలిపాడు. అక్క అక్కడ నుంచి తనకు రాఖీ పంపిందని, ఇక మిగతా ఇద్దరితో కలిసి డిన్నర్కి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. అక్క చెల్లెళ్లతో కలిసి గడిపేందుకు, గిప్ట్లు ఇచ్చేందుకు రాఖీ పండుగ చక్కని అవకాశమని శర్వానంద్ తెలిపాడు. వచ్చే వారం తన సోదరి దగ్గరకు యూఎస్ వెళుతున్నట్లు చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement