'హ్యాపీ బర్త్ డే అఖిల్' | Tollywood Celebs wish Akhil Akkineni on his birthday | Sakshi
Sakshi News home page

'హ్యాపీ బర్త్ డే అఖిల్'

Apr 8 2017 11:16 AM | Updated on Jul 15 2019 9:21 PM

'హ్యాపీ బర్త్ డే అఖిల్' - Sakshi

'హ్యాపీ బర్త్ డే అఖిల్'

అక్కినేని నట వారసుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మారుమోగిపోతోంది. అఖిల్ సినిమాతో

అక్కినేని నట వారసుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మారుమోగిపోతోంది. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి సినిమా సక్సెస్ సాధించలేకపోయినా.. నటుడిగా మంచి మార్కులు సాధించాడు. అయితే రెండో సినిమా విషయంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్... ఇటీవలే మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అఖిల్ టాలీవుడ్ స్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

కింగ్ నాగార్జున ఈ ఏడాది అఖిల్ కలలన్నీ నిజం కావాలని కోరుకోగా, అఖిల్ కు కాబోయే వదిన సమంత 'అందరికీ ప్రియమైన, గొప్ప మనసున్న అఖిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీదే' అంటూ ట్వీట్ చేసింది. హీరో సుమంత్ ఓ ఆసక్తికమైన ఫోటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అఖిల్ పటుట్టినప్పుడు తాను ఎత్తుకున్న ఫోటోతో పాటు ఏదో ఫంక్షన్ లో అఖిల్ పక్కనే కూర్చున్న ఫోటోలతో శుభాకాంక్షలు తెలిపాడు. హీరో రానా, సాయిధరమ్ తేజ్, సుషాంత్, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సయేషా సైగల్ లు అఖిల్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement