ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు | Three of the same film in a megaphone | Sakshi
Sakshi News home page

ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు

Dec 17 2016 1:47 AM | Updated on Sep 28 2018 4:53 PM

ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు - Sakshi

ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు

సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక్కరే దర్శకత్వం వహిస్తుంటారు. అరుదుగా దర్శక ద్వయం కలిసి చిత్రం చేస్తుంటారు.

సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక్కరే దర్శకత్వం వహిస్తుంటారు. అరుదుగా దర్శక ద్వయం కలిసి చిత్రం చేస్తుంటారు. అలాంటిది ఒకే  చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేస్తే కచ్చితంగా అది వైవిధ్యభరిత కథా చిత్రమే అవుతుంది. అదీ ఈ తరం ఆశా దర్శకులైన పా.రంజిత్, పసంగ పాండిరాజ్, సుశీంద్రన్  ముగ్గురు యువ దర్శకులు కలిస్తే ఆ చిత్రం ఒక కొత్త ప్రయోగమే అవుతుంది. అలాంటి వినూత్న ప్రయోగానికి ఈ దర్శక త్రయం సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆ చిత్రం మూడు కథలతో కూడి ఉంటుందట. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నట్లు టాక్‌. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి అధికారిక పూర్వంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులు వారివారి తాజా చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతారని భావించవచ్చు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు పాండిరాజ్‌ తన పసంగ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement