కరోనా దెబ్బ: సినిమా షూటింగ్‌లు బంద్‌ | Telugu Film Industry Stops Shooting Over Corona Effect | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు బంద్‌

Mar 15 2020 7:16 PM | Updated on Mar 15 2020 8:25 PM

Telugu Film Industry Stops Shooting Over Corona Effect - Sakshi

సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మా అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మా అసోసియేషన్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీంతో రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌ ఆగిపోనున్నాయి. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన రోజునే తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌ కూడా మూసివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ( కరోనా ఎఫెక్ట్‌ : విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత )

బాలీవుడ్‌ బంద్‌
కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ షూటింగ్‌లకు బంద్‌ పలికింది. బాలీవుడ్‌ వినోద రంగానికి సంబంధించిన అన్ని విభాగాల షూటింగ్‌లు నిలిపివేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం విధించిన మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈనెల 19నుంచి 31వరకు బంద్‌ కానున్నాయి. 31 తర్వాత నుంచి సినిమా, టీవీ సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లు యధావిధిగా ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement